కన్న కూతురుతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు..
జనగామ జిల్లా: దేవరుప్పుల మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికను ఆమె కన్న తండ్రి లైంగికంగా వేధించాడు. ఈ విషయం ఆ బాలిక తల్లికి చెప్పినప్పటికీ ఆమె స్పందించ లేదు. మరోసారి వేధించడంతో బాలిక తన పెద్దమ్మకు జరిగిన విషయం తెలిపింది. దీంతో ఆమె సహకారంతో బాలిక స్థానిక పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాలిక తండ్రిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవరుప్పుల మండల ఎస్సై ఊర సృజన్ కుమార్ తెలిపారు.కాగా ఆ బాలికను బాలల సంరక్షణ అధికారులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.