ప్రేమ వ్యవహారం.. పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య

ప్రేమ వ్యవహారం.. పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య

ప్రేమ వ్యవహారం.. పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య

ప్రేమ వ్యవహారం లో యువతి
తల్లిదండ్రులు ఆమే ప్రేమికుడిని మందలించడం, దాడి చేయడం, చంపుతానని బెదిరించడంతో పురుగు మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకుని హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఖమ్మం రూరల్ మండలం పడమటి తండాలో నివాసం ఉంటున్న తుమోజు సరస్వతి తన కొడుకు ఆత్మహత్య చేసుకొని మరణించిన ఘటనపై బుధవారం ఖమ్మం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ ఏకైక కుమారుడు విఘ్నేష్ చారి (20)ఖమ్మం పట్టణంలో వెల్డింగ్ పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఖమ్మం పట్టణానికి చెందిన ఒక ముస్లిం యువతీ పరిచయం కావడంతో వారు ఇరువురు గత మాట్లాడుకోవడం కొద్దికాలంగా ఫోన్ లో గమనించిన యువతి తల్లిదండ్రులు పఠాన్ రఫీ, షకీలా దంపతులు ఈ నెల 1న విఘ్నేష్ చారిని కలిసి నువ్వు చచ్చిపో.. లేకపోతే మేమే చంపుతామని బెదిరించి అతనిపై దాడి చేశారు. వారికి భయపడిన విఘ్నేశ్ ఈ నెల 3న కలుపు మందు తాగి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు ఖమ్మంలో ఒక ప్రవైట్ హాస్పిటల్ లో చేర్పించగా చికిత్స పొందుతున్నాడు. బుధవారం చికిత్స పొందుతున్న విగ్నేష్ మృతి చెందాడు. మృతుడి తల్లి సరస్వతి ఫిర్యాదు మేరకు ఖమ్మం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment