మంజరి గ్రామంలో డ్రైనేజీ సమస్యలపై సురేష్ పటేల్ ఆవేదన
భైంసా, జూలై 16 (మనోరంజని):
నిర్మల్ జిల్లా భైంసా మండలం మంజరి గ్రామంలో డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా కొనసాగుతున్నాయని మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురేష్ పటేల్ బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని డ్రైనేజీలు చెత్తచదారంతో నిండిపోయి రోడ్డుపైకి నీరు ఉప్పొంగిపోతున్న పరిస్థితి నెలకొంది. దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
ఇలాగే కొనసాగితే గ్రామంలో రోగాలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. పలు మార్లు గ్రామ పంచాయతీ సెక్రటరీకి వినతులు పెట్టినా పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజలు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణమే సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి మురుగు కాలువలు శుభ్రం చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.