కల్లు కాంపౌండ్లపై చర్యలు తీసుకోవాలి

కల్లు కాంపౌండ్లపై చర్యలు తీసుకోవాలి

కల్లు కాంపౌండ్లపై చర్యలు తీసుకోవాలి

కల్తీ కల్లు బాధితులు పెరగడం ఎక్సైజ్, ఆబ్కారీ శాఖ అధికారుల నిర్లక్ష్యమే

ఎన్ హెచ్ ఆర్ సి. గ్రేటర్ హైదరాబాద్ అధికార ప్రతినిధి ఎస్వి సురేష్ రెడ్డి

సెక్రటేరియట్ (హైదరాబాద్): నగరంలో పలుచోట్ల ప్రమాదకరమైన మత్తు పదార్థాలతో కల్లు తయారుచేసి విక్రయిస్తున్నట్లు తెలిసినా కూడా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే యదేచ్చగా కల్తీ కల్లు విక్రయాలు జరుగుతున్నాయని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) గ్రేటర్ హైదరాబాద్ అధికార ప్రతినిధి ఎస్ వి సురేష్ రెడ్డి అన్నారు. దీనివల్ల నగరంలో కల్తీ కల్లు బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. నగరంలో పలుచోట్ల జరిపిన కెమికల్ ఎగ్జామినేషన్ లో ప్రమాదకరమైన ఆల్ఫ్రాజోలం పదార్థం ఉన్నట్లు తేలిందని అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే కల్తీ కల్లు విక్రయం నిరాటకంగా కొనసాగుతుందని ఆయన అన్నారు. కల్తీ కల్లు విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్, ఆబ్కారీ శాఖ అధికారులు అందుకు విరుద్ధంగా చట్టంలోని లొసుగులను విక్రయదారులకు చెప్పి మరీ అమ్మకాలు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని ఆయన అన్నారు. హైదరాబాదులో తయారవుతున్న కల్లు 90 శాతం కల్తీయేనని అధికారులు ఇప్పటికే గుర్తించారని అయినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో సంబంధిత అధికారుల పాత్రపై విచారణ చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అసలు నగరానికి కనుచూపుమేరలో తాడిచెట్లు లేని విషయం అందరికీ తెలుసని అయినప్పటికీ నగరంలో 97 కల్లు దుకాణాలు ఉన్నట్లు అధికారికంగా లెక్కలు చెబుతున్నప్పటికీ అంతకుమించి అనధికారికంగా ఇష్టానుసారం కల్లు దుకాణాలు నడుపుతున్నట్లు సమాచారం ఉందని ఆయన తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కల్లు దుకాణాల అనుమతులను రద్దు చేయాలని, వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు ఎలా వచ్చాయో సమగ్ర విచారణ చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ జాయింట్ సెక్రెటరీ తిరునగరి లావణ్య, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment