అవకాశం ఇస్తే జడ్పిటిసిగా పోటీ చేస్తా
ముధోల్ మాజీ సర్పంచ్ బి. అనిల్ కుమార్
ముధోల్ మనోరంజని ప్రతినిధి జులై 8
అవకాశం ఇస్తే ముధోల్ జడ్పిటిసి గా పోటీ చేస్తానని మాజీ సర్పంచ్ బి. అనిల్ కుమార్ అన్నారు. గత 30 సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నానని ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీ అంటూ లేదన్నారు. గతంలో మండల కేంద్రమైన ముధోల్ సర్పంచిగా గ్రామస్థాయిలో గ్రామపంచాయతీకి వచ్చిన నిధులను దుర్వినియోగం చేయకుండా గ్రామంలో నెలకొన్నటువంటి అనేక సమస్యలను పరిష్కరించాను. అంతర్గత సీసీ రోడ్లు డ్రైనేజీలు బోర్వెల్స్ పెద్ద మొత్తంలో పూర్తి చేయడం జరిగింది. కులమత బేధాలు లేకుండా కులాలకు అతీతంగా పాలన సాగించానన్నారు. ప్రస్తుతం తాను ఏ పార్టీలో లేనన్నారు. ముధోల్ మండల కేంద్రంలో సుమారు 11వేల ఓట్లు ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని రాజకీయ నాయకులు గమనించి మండల కేంద్రానికి చెందిన నాయకులకు జడ్పిటిసి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏ పార్టీ నుంచి పోటీ చేయాలి అనేది గ్రామస్తులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాను అని అన్నారు. ప్రజలు అవకాశం ఇస్తే ముధోల్ మండల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు.