తల్లి తండ్రుల పై ఫీజుల భారం – విద్యార్థుల వీపుపై పుస్తకాల భారం.

తల్లి తండ్రుల పై ఫీజుల భారం - విద్యార్థుల వీపుపై పుస్తకాల భారం.

తల్లి తండ్రుల పై ఫీజుల భారం – విద్యార్థుల వీపుపై పుస్తకాల భారం.

పాకాల జులై 7…..

పాకాల మండలంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పుస్తకాల భారం తో నిత్యం నలిగిపోతున్నారు అని బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడు కొత్తపల్లి వెంకటాద్రి నాయుడు విమర్శిస్తున్నారు. 45 నిమిషాల నిడివి కలిగిన ఒక పీరియడ్ లో మూడు నుంచి నాలుగు పుస్తకాలు తిరగేయడం ఎంతవరకు సమంజసం అని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రైవేట్ పాఠశాలలను ఒక్కో విద్యార్థి నుండి వర్క్ బుక్కుల కొరకు మాత్రమే రెండున్నర వేల నుంచి నాలుగున్నర వేల వరకు వసూలు చేస్తున్నారు. టెక్స్ట్ బుక్కులు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్కులు, డైరీ, మరియు లంచ్ బాక్స్ అంటూ పిల్లలపై బరువు పెంచడంతో పిల్లలు ఆ బరువు మోయలేకపోతున్నారు. ఒకవైపు ప్రభుత్వం పుస్తకాల బరువు తగ్గించింది అంటున్నా పాకాల మండలం లో మాత్రం ఆచరణలో సాధ్యం కావడం లేదు. ఇక మండలంలోని విద్యాశాఖ మాత్రం ప్రకటనలకే పరిమితమైంది అనటంలో ఆశ్చర్యం కలగక మానదు. నిభందనలు పాటించని ఏ ఒక్క ప్రైవేటు ప్రైవేటు పాఠశాలపై చర్యలు తీసుకున్నట్టుగాని పిల్లల పై బుక్కుల భారం తగ్గించిన్నట్టు గాని దాఖలాలే లేవు అని తల్లిదండ్రులు అంటున్నారు. మరో వైపు అధిక ఫీజులతో ప్రైవేటు పాఠశాలలు తల్లిదండ్రులను అడ్డంగా దోచేస్తూ బెంబేలెత్తిస్తున్నా మండలంలో నడుస్తున్న పాఠశాలలపై ఫీజు నియంత్రణ కమిటీ చూసి చూడనట్టు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది అనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు మొద్దు నిద్ర వీడి ఇటు పిల్లలపై పుస్తకాల భారాన్ని ఆటు తల్లిదండ్రులపై ఫీజుల భారాన్ని తగ్గిచవలసినదిగా తల్లిదండ్రులు మరియు వెంకటాద్రి నాయుడు కోరుతున్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment