భూమికి ఆవైపున.. మినీ భారతదేశం.. ప్రధానితో పాటు 40 శాతం మంది మనోళ్లే..!!

భూమికి ఆవైపున.. మినీ భారతదేశం.. ప్రధానితో పాటు 40 శాతం మంది మనోళ్లే..!!

భూమికి ఆవైపున.. మినీ భారతదేశం.. ప్రధానితో పాటు 40 శాతం మంది మనోళ్లే..!!

మికి ఈ వైపున 150 కోట్ల మందితో ఉన్న భారతదేశం గురించి మనందరికీ తెలుసు.. కానీ, భూమికి ఆ వైపున కూడా ఓ మినీ భారత దేశం ఉన్న సంగతి తెలుసా..? వందల ఏళ్ల కిందటే మనవాళ్లు అక్కడ చెరుకు తోటల్లో పనికి వెళ్లి స్థిరపడి పోయిన సంగతి తెలుసా?

ఆ దేశం నుంచి క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయిలో ఆడిన విషయం తెలుసా..? ఇప్పుడు భారత ప్రధాని మోదీ ఆ దేశంలో పర్యటిస్తూ.. వారి/మన మూలాలను గుర్తు చేశారు.

సునీల్ నరైన్.. ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో అందరికీ పరిచయమే.. దినేష్ రామ్ దిన్, రవి రాంపాల్ కూడా అంతర్జాతీయ క్రికెట్ ఆడారు. వీరి దేశం పేరు ట్రినిడాడ్ అండ్ టొబాగో. కరీబియన్ దీవులకు చెందిన వీరంతా వెస్టిండీస్ పేరిట క్రికెట్ ఆడారు. తాజాగా భారత ప్రధాని మోదీ ట్రినిడాడ్-టొబాగోలో పర్యటిస్తున్నారు. కరీబియన్ దీవుల్లోని ఈ దేశ ప్రధాని కూడా భారత సంతతి వారే. ఆయన పేరు కమలాప్రసాద్ బిస్సేస్సర్. ట్రినిడాడ్-టొబాగో జనాభాలో 42 శాతం భారత సంతతివారే కావడం విశేషం.

గత గురువారం మోదీ ట్రినిడాడ్ అండ్ టొబాగో రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ చేరుకోగా ఆయనకు సంప్రదాయ భోజ్ పురి చౌతల్ (జానపాద గీతం)తో ఘన స్వాగతం లభించింది. ఇది రెండు దేశాల కల్చరల్ అనుబంధాన్ని చాటుతోందని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

ట్రినిడాడ్ ప్రధాని కమలా పూర్వికులది బిహార్ లోని బక్సర్ అని మోదీ గుర్తుచేశారు. మరోవైపు మోదీ.. 25 ఏళ్ల కిందట తాను వచ్చినపపుడు బ్రయాన్ లారా కవర్ డ్రైవ్, పుల్ షాట్లను బాగా చర్చించుకున్నామని తెలిపారు. ఇప్పుడు నరైన్, నికొలస్ పూరన్ గురించి మాట్లాడుకుంటున్నట్లు తెలిపారు.

కాగా, బ్రిటిష్ పాలనలో ఉండగా.. 19వ శతాబ్దంలో భారత దేశం నుంచి ఒప్పంద కార్మిక వ్యవస్థ ప్రకారం ట్రినిడాడ్ అండ్ టొబాగో తీసుకెళ్లారు. 1845-1917 మధ్య అప్పటి అవిభాజ్య భారత దేశం నుంచి 1.43 లక్షల మందిని తరలించారు. ఎక్కువగా ఉత్తర భారతం వారే. మరీ ముఖ్యంగా యూపీ, బిహార్ వారు. అందుకే అక్కడ బోజ్ పురి మాట్లాడేవారు ఎక్కువగా ఉంటారు. గిర్మిట్ అనే వలస ఒప్పందం మేరకు మూడేళ్లు పనిచేసేందుకు వెళ్లి వెనక్కు తిరిగి రావొచ్చు. కానీ, చాలామంది అక్కడే స్థిరపడిపోయారు. ఇప్పుడు ట్రినిడాడ్ అండ్ టొబాగో 14 లక్షల జనాభాలో 42 శాతంపైగా భారత సంతతివారే

Join WhatsApp

Join Now

Leave a Comment