కామ్రేడ్ కాల్వ నర్సన్న యాదవ్ గారి 6వర్ధంతి వేడుకలు.
మనోరంజని, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి.
భీమారం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం వ్యవస్థాపకులు యాదవ సంఘం జాతీయ నాయకులు స్వర్గీయులు కాల్వ నర్సయ్య యాదవ్ 6 వర్ధంతి ని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వర్గీయులు కాల్వ నర్సయ్య యాదవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాల్వ నరసయ్య యాదవ్ యాదవ జాతిలో పుట్టడం ఎంతో మచ్చలేని మనిషిగా పేరు తెచ్చుకున్న గొప్ప నాయకున్ని కోల్పోయిన మన రాష్ట్ర యాదవ సంఘం నాయకులకు తీరనిలోటు అని తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కురుమలకు అనేక సేవలు చేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి గొల్ల కురుమల సమస్యలు తీసుకువెళ్లి గొర్రెల స్కీమ్ పెట్టేవరకు అహర్నిశలు శ్రమిస్తూ నిద్ర ఆహారాలు లేకుండా నిత్యం గొల్ల కురుమల ప్రజాల సేవె లక్ష్యంగా జీవితం అంకితం చేసిన నాయకుడు స్వర్గీయులు కాల్వ నర్సన్న యాదవ్ కి ఇవే మన ఘన నివాళులు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం చెన్నూర్ నియోజకవర్గం అధ్యక్షులు పోతం సమ్మన్న యాదవ్,నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మెండే మల్లేష్ యాదవ్,మండల ప్రధాన కార్యదర్శి కేశవేణి సత్యనారాయణ యాదవ్, ఉపాధ్యక్షులు దారవేణి తిరుపతి యాదవ్. రమేష్ యాదవ్ నాయకులు పాల్గొన్నారు