ఇంగ్లండ్ గాలి తీసేసిన పంత్.. ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటారు!
క్రికెట్‌లో స్లెడ్జింగ్ సర్వసాధారణమే. టెస్ట్ క్రికెట్‌లో ఇది కామన్ అయిపోయింది. అందుకే సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆటగాళ్లు ఫిజికల్‌గా మాత్రమే ఫిట్‌గా ఉంటే సరిపోదు. మానసికంగానూ బలంగా ఉండటం తప్పనిసరి. ప్రత్యర్థుల కవ్వింపులను తట్టుకొని నిలబడాలి. స్లెడ్జింగ్ లాంటివి చేసినా ఆటతీరుతోనో లేదా మాటలతోనూ కౌంటర్ అటాక్ చేయాలి. ఇదే సూత్రాన్ని పాటిస్తున్నాడు టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్. మాటకారి అయిన పంత్.. తన బ్యాట్‌తోనే కాదు.. మాటలతోనూ ప్రత్యర్థులకు ఇచ్చిపడేస్తున్నాడు.
నా గురించి తెలుసా..
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో రెండో ఇన్నింగ్స్‌లో రాణించాడు పంత్. 58 బంతుల్లో 65 పరుగుల ధనాధన్ నాక్‌తో జట్టు భారీ ఆధిక్యం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే అతడు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ప్రత్యర్థి జట్టు బ్యాటర్ హ్యారీ బ్రూక్ రెచ్చగొట్టాడు. నా రికార్డుల గురించి తెలుసా అంటూ ఓవరాక్షన్ చేశాడు. నీ ఫాస్టెస్ట్ హండ్రెడ్ ఎంత అంటూ భారత బ్యాటర్‌ను అడిగాడు బ్రూక్. దీంతో టెస్టుల్లో 80 నుంచి 90 బంతుల్లో శతకం బాదాను అనుకుంటా అని పంత్ కాస్త సందేహిస్తూ సమాధానం ఇచ్చాడు..