“జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్” సభకు హైదరాబాద్ వేదిక

“జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్” సభకు హైదరాబాద్ వేదిక

“జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్” సభకు హైదరాబాద్ వేదిక

కాంగ్రెసు పార్టీ భారీ ప్రజాసమావేశం – జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో నిర్వహణ

హైదరాబాద్, జూలై 4 (2025):

“జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్” నినాదంతో కాంగ్రెసు పార్టీ హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో భారీ ప్రజాసమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు నేతృత్వం వహించారు. పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు, ప్రముఖ నాయకులు ఈ సభకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు భర్గవ్ వల్లురు గారు ఖర్గే గారిని, కేంద్ర నాయకురాలు మీనాక్షి గారిని కలుసుకున్నారు. సమావేశం ముగిసిన తర్వాత, ఈ కార్యక్రమాన్ని విజయవాడలో కూడా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

“జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్” ఉద్యమ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా ఆలోచనాత్మక చర్చలకు ఇది వేదికవుతుందని, భావజాల పరిరక్షణకు అవసరమైన సమయమిదని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.

APCC ఆధ్వర్యంలో విజయవాడలో త్వరలో జరగబోయే ఈ కార్యక్రమానికి ఖర్గే గారు హాజరయ్యే అవకాశం ఉందని భర్గవ్ వల్లురు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment