అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించిన “మే ఐ హెల్ప్ యు” ఫౌండేషన్ ప్రొద్దుటూరు మండలంలో పాలాభిషేకం, పూలమాలలతో వినూత్న శ్రద్ధాంజలి

అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించిన “మే ఐ హెల్ప్ యు” ఫౌండేషన్ ప్రొద్దుటూరు మండలంలో పాలాభిషేకం, పూలమాలలతో వినూత్న శ్రద్ధాంజలి

అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించిన “మే ఐ హెల్ప్ యు” ఫౌండేషన్
ప్రొద్దుటూరు మండలంలో పాలాభిషేకం, పూలమాలలతో వినూత్న శ్రద్ధాంజలి

మనోరంజని ప్రతినిధి ప్రొద్దుటూరు ఏప్రిల్ 14 :-
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా “మే ఐ హెల్ప్ యు” ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు మండల కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి, పుష్పమాలలతో ఘన నివాళులు అర్పించారు.

అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించిన “మే ఐ హెల్ప్ యు” ఫౌండేషన్
ప్రొద్దుటూరు మండలంలో పాలాభిషేకం, పూలమాలలతో వినూత్న శ్రద్ధాంజలి

ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఛైర్మన్ మోరే లక్ష్మణ్ రావు గారు పాల్గొని మాట్లాడుతూ, “డాక్టర్ అంబేద్కర్ కలలు కన్న సమానత్వ సమాజ నిర్మాణంలో ప్రతి యువకుడి పాత్ర కీలకం. మా ఫౌండేషన్ సేవా మార్గంలో అంబేద్కర్ గారి విలువలను ఆచరణలోకి తేవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది” అని తెలిపారు.

“మే ఐ హెల్ప్ యు” ఫౌండేషన్ అనేది యువత ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక సేవా సంస్థ. పేదలకు, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడమే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ, విద్య, ఆరోగ్య, సామాజిక అంశాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రాధాన్యత పొందుతోంది.

కార్యక్రమంలో పోలీస్ అధికారి భాస్కర్ గారు ప్రత్యేక అతిథిగా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫౌండేషన్ తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఫౌండేషన్‌కు చెందిన సభ్యులు టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్, ట్రెజరర్ భార్గవ్ సాయి,మనోహర్,రమణాచారి, కృపా ఆగ్ని షారూన్ ట్రస్ట్ సభ్యులు పాపిశెట్టి వెంకట లక్షుమ్మ ,సుమన్ బాబు మరియు తదితరులు సమూహంగా పాల్గొని, డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని స్మరించుకున్నారు. భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం ముగిసింది

Join WhatsApp

Join Now

Leave a Comment