అంబకంటి గ్రామంలో కోతకు గురైన కెనాల్ కాలువ మరమ్మత్తులు చేయాలంటున్న రైతన్నలు
నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని అంబకంటి గ్రామ శివారులో గల కెనాల్ కాలువ వర్షాకాలం వర్షాలకు కోతకు గురై కాలువ దివనున్న రైతన్నలు పంట పొలాలకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. వర్షాకాలం తమ పంట పొలాలకు వెళ్లేందుకు రైతులందరూ కలిసి కోతకు గురైన కాలువ వద్ద సొంత డబ్బులతో మొరం పోయించి వెళ్తున్నామని మళ్లీ వర్షాకాలం రాగానే కోతకు గురైన వద్ద మొరం కొట్టుకపోవడంతో పంటలు తీవ్రంగా నష్టపోతున్నాయని అన్నదాతలు వాపోతున్నారు. ఈ సమస్యను అధికారులకు పలమార్లు రైతన్నలు తెలియజేసిన సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో కోతకు వచ్చిన పంటలు భూమి పాలవుతున్నాయని వరి ,మొక్కజొన్న, , జొన్న పంటలు కోసేందుకు హార్వెస్టర్ ట్రాక్టర్ పంట పొలాలకు తీసుకెళ్లాలంటే కెనాల్ కాల్వ పై దారి లేక వాహన యజమానులు రాలేకపోతున్నారని రైతన్నలు వాపోయారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి పంట నష్టం జరగకముందే కెనాల్ కాల్వ పై శాశ్వతంగా బ్రిడ్జి నిర్మించి రైతన్నలు ఆదుకోవాలని అంటున్నారు