రేషన్ షాప్ కు సమయపాలన ఉండదా
నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని లింబా( కె) గ్రామంలో రేషన్ షాప్ వద్ద రేషన్ బియ్యం కోసం లబ్ధిదారులు క్యూ లైన్ లో సంచులను పెట్టి రేషన్ డీలర్ కోసం ఎదురుచూస్తున్నామని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రేషన్ షాప్ వద్ద సమయపాలన బోర్డులు గోడ పై రాసి డీలర్ సమయపాలన పాటించకపోవడంతో అధికారులు రేషన్ డీలర్ పై చర్యలు తీసుకోవాలని వాపోతున్నారు