అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు .. SFI నిర్మల్ జిల్లా కన్వీనర్ దిగంబర్

మూగజీవాల ప్రాణాలు తీస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ,SFI

తెలంగాణ రాష్ట్రంలో బుల్డోజురుల ప్రభుత్వం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీల భూముల జోలికొస్తే రాష్ట్రా వ్యాప్తంగా ఉద్యమలు* ,

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

SFI నిర్మల్ జిల్లా కన్వీనర్ దిగంబర్

ఈ సందర్భంగా దిగంబర్ మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తుంటే పోలీసులు అక్రమంగా అరెస్టులు చేస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో బుల్డోజు రులను పెట్టి మూగజీవాల ప్రాణాలు తీస్తున్నారు అన్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు గత వారం రోజుల నుండి మా యూనివర్సిటీ భూములను వేలం వెయ్యద్దు అని ఉద్యమాలు చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యార్థులపై అక్రమంగా లాఠీచార్జిలు చేపిస్తూ అరెస్టులు చేస్తున్నారన్నారు కార్పొరేట్ ప్రైవేటు వ్యక్తులకు యూనివర్సిటీ భూములను కట్టబెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందన్నారు విద్యార్థులు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో దొరల రాజ్యం నడుస్తుందన్నారు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచింపజేసి యూనివర్సిటీ విద్యార్థులకు క్షమాపణలు చెప్పి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీల భూముల జోలికి మేము వెళ్ళమని బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలన్నారు లేదంటే రాష్ట్రవ్యాప్తంగా మరో విద్యార్థి ఉద్యమాలు ఉంటాయని ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు..

Join WhatsApp

Join Now

Leave a Comment