గోనే స్వామి ఇంటిని కూల్చివేసిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలి.కుటుంబానికి న్యాయం చేయాలి
జే. రాజు సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి*
ఖానాపూర్ మండలంలోని రంగాపేట్ కొత్తగూడెంలో గోనె స్వామి,గోనె స్వామి కూతురు గోనె మల్లీశ్వరి కుటుంబ గుడిసెను కూల్చిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని,కుటుంబానికి న్యాయం చేయాలని *సిపిఐ (ఎంఎల్ )న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కమిటీ* ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సమస్య పరిష్కరించేంతవరకు నిరవధిక ధర్నా కొనసాగుతుంది.
ఈ సందర్భంగా ,*సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె. రాజు,* మాట్లాడుతూ ఖానాపూర్ మండలంలో రంగాపేట్ కొత్తగూడెంలో దాదాపు 40 కుటుంబాలు తరతరాలుగా భూ పోరాటం ద్వారా సాధించుకున్న స్థలంలో గోనె స్వామి,కూతురు గోనె మల్లేశ్వరి ఇంటికి, గ్రామ పంచాయతీలో 2005 నుండి 2009 వరకు ఇంటి ట్యాక్స్ చెల్లించడం జరిగింది. మరియు గత కాంగ్రెస్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం హయంలో 2008లో ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు అయి,12 వేల రూ మంజూరు అయింది. పునాది, కొంత గోడ లేపి అప్పటినుండి నివాసముంటున్నారు. వీరితోపాటు 14 మందికి ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరైనవి. ప్రభుత్వం కరెంటు, మంచినీళ్లు, రోడ్డు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసింది. ఈ గుడిసెను తేదీ 5.3.2025 నాడు ఎఫ్ఆర్ఓ పేరు మీద రెండు నోటీసులు అనగా 16.1.2025, 12.02.2025 తేదీలతో రెండు నోటీసులు ఇచ్చి ఏడవ తేదీ నాడు, ఇంటిని (గుడిసె)ను అక్రమంగా, దౌర్జన్యంగా కూల్చి వేసినారు. వీరికి ఈ ఇల్లు తప్ప ఎటువంటి భూమి కానీ, ఇల్లుకానీ లేకపోవడంతో ఏడో తేదీ నుండి నేటి వరకు ఎర్రటి ఎండలో రోడ్డుమీద గోనే స్వామి కుటుంబం ముసలవ్వ, చిన్నపిల్లలతో నివాసం ఉంటున్నారు. స్థానిక ఫారెస్ట్ అధికారులు కొంతమంది చోట లీడర్ల మాయ మాటలు విని ఒక నిరుపేద కుటుంబాన్ని లక్ష్యం చేసుకుని దుర్మార్గంగ వ్యవహరించడం సిగ్గుచేటు . రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును కాలరాయడం ఎంత వరకుసమంజసం అని ప్రశ్నించారు. ఎఫ్ ఆర్ ఓ చర్య వల్ల రోడ్డుమీద పాములు, తేల మధ్య భయభ్రాంతులతో జీవిస్తున్న గోన స్వామి కుటుంబానికి ఏమైనా హాని జరిగితే ఖానాపూర్ ఎఫ్ఆర్ఓ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.అనంతరం కలెక్టర్ కి వినతిపత్రం సమర్పించారు.dfo తో చర్చించి పరిష్కారం చేస్తామని కల్లెక్టర్ గారు హామీ ఇచ్చారు.రోడ్డు మీద జీవిస్తున్న కుటుంబం కి హామీ ఇవ్వడం కాదని,తక్షణమే పరిష్కరించాలని,అప్పటివరకు ధర్నా కొనసాగుతుందని పార్టీ నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో *సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేష్, జిల్లా నాయకులు సింగరి వెంకటేష్, ఖానాపూర్ డివిజన్ నాయకులు దుర్గం లింగన్న, గూట్ల ప్రసాద్, గోనె స్వామి, గోగు శేఖర్, రేగుల గంగన్న, మచ్చ కైలాస్, మాన్క శ్రీనివాస్, గోగు భూమక్క, గూట్ల రజిత, నైతం లింగు బాయి,* తదితరులు పాల్గొన్నారు.
విప్లవ అభినందనలతో….
*సునారికారి రాజేష్ సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి ఖానాపూర్*