పోలీసు విధులకు ఆటంకం కల్గించిన ఇద్దరు వ్యక్తుల పై కుంటాల పోలీసు స్టేషన్లో కేసు నమోదు
ఎస్ఐ తెల్పిన వివరాల ప్రకారం
ఈ రోజు ఉదయం కల్లూరు గ్రామ పరిధిలో నేషనల్ హైవే పక్కన మేకల సంత జరుగుచుండగా రోడ్డు పైన మేకలు గొర్లు పెట్టి వాహనాలకు యిబ్బంది కల్గే విదంగా ఉన్నారని పిర్యాదు మేరకు patro car లో అక్కడికి వెళ్లి రోడ్డు ట్రాఫిక్ క్లియర్ చేసే క్రమంలో ఎస్ఐ మరియు సిబ్బంది విజయ్ తో చాక్ పల్లి కి చెందిన గోర మియ హుస్సేన్, ఫిర్దోస్ గోర మియా తండ్రి కొడుకులు ఇద్దరు మేము ఇలానే చేస్తాము అందరు ఉన్నారు మమ్మల్నే ఎందుకు తీస్తారు అంటూ పై పై కి వచ్చి వీడియో తీస్తున్న ఎస్ఐ చేతుల నుండి ఫోన్ లాక్కుని ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కల్గించి మరియు దుర్భాషలు ఆడినందుకు ఇద్దరినీ పోలీసు స్టేషను కు తరలించి చట్టా ప్రకారం అరెస్టు చేయడం జరిగింది.
పోలీసు విధులకు ఆటంకం కల్గించిన ఇద్దరు వ్యక్తుల పై కుంటాల పోలీసు స్టేషన్లో కేసు నమోదు
Published On: March 1, 2025 4:44 pm