ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ.. కోరింది ఇవేనట..
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా మోడీతో భేటీ అయిన రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఐదు అంశాలపై ప్రధానితో సీఎం రేవంత్ చర్చించారు. తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ఐదు అంశాలపై ప్రధానికి నివేదిక ఇచ్చారు సీఎం. ఆర్‌ఆర్‌ఆర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో రైల్ వేస్ టు కు రూ.24269 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే 55 కిలోమీటర్ల మేర పొడవు ఉన్న మూసీ నదికి పునర్జీవం కల్పించడం మూసీ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యమని.. మూసీ ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్లు ఇవ్వాలని వినతి చేశారు.
అలాగే తెలంగాణకు 29 మంది ఐపీఎస్‌ల కొరత ఉందని ప్రధానికి తెలిపారు. సెమీ కండక్టర్ మిషన్, అడ్వాన్స్ సెమీ కండక్టర్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్ హబ్బుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుందని మోదీకి వెల్లడించారు. తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్ట్‌ల వివరాల నివేదికను ప్రధాని మోదీకి సమర్పించారు. ప్రధాని కూడా గత పదేళ్ల ప్రభుత్వంలో తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌ల వివరాలను రేవంత్‌కు ఇచ్చారు.
తెలంగాణలో చేపట్టిన పలు ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేయడంతో పాటు విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద ఘటనపై ప్రధానికి వివరించారు. పలువురు కేంద్రమంత్రులను కూడా రేవంత్ కలిసే అవకాశం ఉంది. సీఎం రేవంత్ వెంట మంత్రి శ్రీధర్ బాబు, పలువురు ముఖ్యనేతలు ఉన్నారు