అయోధ్య శ్రీరాముని దర్శించుకున్న బాసర వాసులు

అయోధ్య శ్రీరాముని దర్శించుకుంటున్న బాసర భక్తులు
  1. బాసర నుంచి యాత్రలో మూడో రోజు అయోధ్య శ్రీరాముడి దర్శనం
  2. షరయూ నదిలో పవిత్ర స్నానం చేసిన భక్తులు
  3. రాముడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజల సంక్షేమం కోరిన భక్తులు

 

బాసర నుంచి అయోధ్య యాత్రలో భాగంగా మూడో రోజు భక్తులు అయోధ్య శ్రీరాముడిని దర్శించుకున్నారు. షరయూ నదిలో పవిత్ర స్నానం చేసి, మొక్కులు తీర్చుకున్నారు. శ్రీకృష్ణ ఆలయం అధ్యక్షుడు మహారాజ్ భూమన్న, బీజేపీ పట్టణ అధ్యక్షుడు జిడ్డు సుభాష్ యాదవ్ కుటుంబ సమేతంగా భక్తి భావంతో రాముని కృప కోరారు.

 

భైంసా:

ఉత్తరప్రదేశ్ పుణ్యక్షేత్రమైన అయోధ్య రామ భూమి వద్ద బాసర నుంచి భక్తుల యాత్ర మూడో రోజుకు చేరుకుంది. షరయూ నదిలో పవిత్ర స్నానం చేసి, అనంతరం భక్తులు శ్రీరాముడి దర్శనం చేసుకున్నారు. భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటూ, రాముడి ఆశీస్సుల కోసం ప్రార్థనలు చేశారు.

ఈ యాత్రలో శ్రీకృష్ణ ఆలయం అధ్యక్షుడు మహారాజ్ భూమన్న, బీజేపీ పట్టణ అధ్యక్షుడు జిడ్డు సుభాష్ యాదవ్ తమ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. హల్దా సుభాష్ మాట్లాడుతూ, రామ భూమిపై రాముడిని దర్శించడం మహద్భాగ్యంగా భావిస్తున్నానని, రాముడి ఆశీస్సులు బాసర గ్రామ ప్రజలకే కాకుండా, మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ కలగాలని ఆకాంక్షించారు.

భక్తులంతా భజనలు గానాలు చేస్తూ రామనామ స్మరణతో ఆలయ పరిసరాలను మంగళమయం చేశారు. అయోధ్య శ్రీరాముని దర్శనం ద్వారా భక్తులు తమ మనస్సు ప్రశాంతంగా మారిందని, ఈ పవిత్ర యాత్ర ద్వారా మళ్లీ తిరిగి రావాలనే ఆసక్తి కలుగుతోందని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment