ప్రభు స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం.
నిర్మల్ జిల్లా – సారంగాపూర్: మండలంలోని వైకుంఠపూర్ గ్రామంలో గల పురాతన ప్రభు స్వామి శివాలయం పునర్నిర్మాణ మందిరంలో విగ్రహాలు మల్లికార్జున స్వామి,లక్ష్మీనరసింహ స్వామి,సంతాన లక్ష్మీదేవి, హనుమాన్ సహిత నవగ్రహాలు ధ్వజస్థంభం,శిఖర ప్రతిష్టాపన మహోత్సవం కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు శుక్రవారం ఆలయ నిర్వాహకులు,గ్రామస్థులు ప్రధాన అర్చకులు ఆనంద్ తెలిపారు
ఇట్టి కార్యక్రమం శని, ఆది,సోమవారాల్లో వేద పండితులు శ్రావణ్ కుమార్,రాజు,ప్రవీణ్ శర్మ చే ప్రతిష్టాపన అనంతరం మహా అన్నదానం ఉంటుందన్నారు.
ఈ మహోత్సహానికి మండల వాసులతో చుట్టుపక్కల గ్రామాల భక్త జననం అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు