ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
తానూర్, ఫిబ్రవరి 11
నిర్మల్ జిల్లా తానూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో డిఆర్డిఓ విజయలక్ష్మి ఈజీఎస్ సిబ్బందితో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నర్సరీల నిర్వహణ, ఉపాధి పనులు, పారిశుద్ధ్య కార్యక్రమాలపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు.
డిఆర్డిఓ మాట్లాడుతూ, గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను పకడ్బందీగా నిర్వహించడం, అలాగే ఉపాధి పనులను పూర్తిగా పారదర్శకంగా చేపట్టడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. నర్సరీల నిర్వహణలో లోపాలకు తావు లేకుండా సాంకేతిక మార్గదర్శకాలను పాటించాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ, ఏపీవో, ఎంపిఓ, ఉపాధి సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.