ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
నిజామాబాద్, రెంజల్: ఫిబ్రవరి 11
త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి మంగళవారం నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్శనలో గవర్నర్ మాట్లాడుతూ, కందకుర్తి గ్రామం చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగినదని, ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ బాలిరామ్ హెగ్దేవార్ జన్మించిన ప్రదేశమని గుర్తుచేశారు. ఈ క్రమంలో, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కేశవ స్మృతి మందిరం పనులను ఆయన స్వయంగా పరిశీలించారు.
అలాగే, త్రివేణి సంగమం వద్ద ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ స్థాపించి 2025 దసరా నాటికి వంద సంవత్సరాలు పూర్తి కానున్న సందర్భంగా కేశవ స్మృతి మందిరం పనులను వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని స్థానికులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో కేశవ సమితి అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, అంకు మహేష్, ప్రవీణ్ మహరాజ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డి మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.