ప్రతి ఎకరాకు సాగు నీరు అందిస్తాం – ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి

MLA-Rajesh-Reddy-Inspecting-Pump-House-Nagarkurnool
  • మండలంలోని ప్రతి ఎకరానికి సాగు నీరు అందించడమే లక్ష్యం.
  • కాలువల నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు అధికారులకు ఆదేశాలు.
  • మార్కండేయ పంప్ హౌస్ పనులను తనిఖీ చేసిన ఎమ్మెల్యే.
  • రైతుల పొలాలకు నీటిని అందించేందుకు ఎర్రకుంట, ఊర చెరువులను నింపే ప్రయత్నం.
  • రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని రైతులకు విజ్ఞప్తి.

 

బిజినేపల్లి మండలంలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. మార్కండేయ పంప్ హౌస్ పనులను మంగళవారం ఆకస్మిక తనిఖీ చేసి కాలువల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల కండ్లలో ఆనందం నింపేందుకు రెండు పంటలకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా పాలనను మెరుగుపరిచేందుకు కాంగ్రెస్ హామీలు నెరవేరుస్తుందని తెలిపారు.

 

నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే తన ప్రథమ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మండలంలోని శాయిన్ పల్లె శివారులో కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మార్కండేయ పంప్ హౌస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి పనులను పరిశీలించారు. కాలువల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు.

అయకట్టు రైతులకు ఇబ్బంది లేకుండా ఎర్రకుంట, ఊర చెరువులను నింపి రైతుల పొలాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చేందుకు ప్రయత్నిస్తుందని, రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని రైతులను కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment