అబ్బరాన్ని అంటిన క్రికెట్ సంబరాలు – ఉప్పరమల్యాల ప్రీమియర్ లీగ్ (UPL-3)

ఉప్పరమల్యాల ప్రీమియర్ లీగ్ 3 క్రికెట్ విజేతలు

గంగాధర మండలంలో ఘనంగా ముగిసిన టోర్నమెంట్

  • ఫైనల్ మ్యాచ్‌లో నేరెళ్ల జగదీష్ టీం విజయం
  • 34 పరుగుల తేడాతో సారబుడ్ల ప్రశాంత్ రెడ్డి టీం రన్నరప్
  • క్రీడాకారులకు బహుమతుల ప్రధానం – మాజీ వైస్ ఎంపీపీ కర్ర బాపు రెడ్డి స్పాన్సర్‌

 

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఉప్పరమల్యాల గ్రామంలో జరిగిన ఉప్పరమల్యాల ప్రీమియర్ లీగ్ (UPL-3) క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఫైనల్‌లో నేరెళ్ల జగదీష్ టీం 34 పరుగుల తేడాతో గెలిచి విజేతగా నిలిచింది. మాజీ వైస్ ఎంపీపీ కర్ర బాపు రెడ్డి స్పాన్సర్‌గా, క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ టోర్నమెంట్‌ విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను గ్రామ యువత అభినందించింది.

 

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఉప్పరమల్యాల గ్రామంలో ఉప్పరమల్యాల ప్రీమియర్ లీగ్ సీజన్-3 (UPL-3) క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌లో నేరెళ్ల జగదీష్ టీం 34 పరుగుల తేడాతో సారబుడ్ల ప్రశాంత్ రెడ్డి టీంపై విజయం సాధించింది.

ఈ టోర్నమెంట్‌కి గంగాధర మాజీ వైస్ ఎంపీపీ కర్ర బాపు రెడ్డి స్పాన్సర్‌గా వ్యవహరించారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, విజయవంతమైన క్రీడా సంబరాలను ఉత్సాహపరిచారు. గెలిచిన ఆటగాళ్లకు బాపు రెడ్డి, మండల నాయకుడు ముద్దం నాగేష్ గారు బహుమతులను అందజేశారు.

ఈ టోర్నమెంట్ నిర్వహణలో లంకదసరి మహేష్, దోమకొండ శ్రీకాంత్, దోమకొండ మారుతీ, బందరకంటి మధు కీలక పాత్ర పోషించారు. వేడుకలో ఇరిగేషన్ డీఈ వినోద్, గ్రామ యువత, క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. UPL-3 యువ క్రీడాకారుల ప్రతిభను చాటే గొప్ప వేదికగా నిలిచింది.

 

 

Join WhatsApp

Join Now

Leave a Comment