మల్లన్న బ్రహ్మోత్సవాలకు చంద్రబాబు.. ఈరోజు శ్రీశైలంకు వెళుతున్న ఆరుగురు మంత్రులు

మల్లన్న బ్రహ్మోత్సవాలకు చంద్రబాబు.. ఈరోజు శ్రీశైలంకు వెళుతున్న ఆరుగురు మంత్రులు

ఈనెల 19 నుంచి మార్చి 1 వరకు శ్రీశైలం బ్రహ్మోత్సవాలు

ఈనెల 23న శ్రీశైలంకు వెళుతున్న చంద్రబాబు

శివరాత్రి ఏర్పాట్లను ఈరోజు పరిశీలించనున్న మంత్రుల బృందం

శ్రీశైలం బ్రహ్మోత్సవాలు ఈనెల 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 23న శ్రీశైలంకు వెళ్లనున్నారు. స్వామి, అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు ఎవరైనా వచ్చి పట్టు వస్త్రాలను సమర్పించేవారు. ఈసారి నేరుగా ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను సమర్పించనుండటం గమనార్హం.

మరోవైపు మహాశివరాత్రి ఏర్పాట్లను పరిశీలించేందుకు రాష్ట్ర మంత్రుల బృందం ఈరోజు శ్రీశైలంకు వెళ్లనుంది. మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్, అనిత శ్రీశైలంలో పర్యటించనున్నారు.

శ్రీశైలంను ఆథ్యాత్మిక నగరంగా తీర్చి దిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విదేశీ యాత్రికులను సైతం ఆకట్టుకునేలా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది. విడతల వారీగా వసతులను మెరుగు పరిచేందుకు కన్సల్టెన్సీల ద్వారా ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment