*సోదరి హల్దీ వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ యువతి గుండెపోటుతో మృతి*
*మనోరంజని ప్రతినిధి*
హైదరాబాద్:ఫిబ్రవరి 10
మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. కానీ, సడెన్ గా వస్తుంది. రెప్పపాటులో ప్రాణం పోతుంది. అప్పటి వరకు ఎంతో ఆనందంగా ఉన్న వ్యక్తి సడెన్ గా మృత్యువు ఒడికి చేరుతున్నారు.
తాజాగా ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదిష జిల్లాలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. అప్పటివరకు స్టేజ్ పై ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న యువతి సడెన్ గా కుప్పకూలింది.
తన కజిన్ సోదరి హల్దీ వేడుకలో 2 వందల మంది పైగా అతిథులు ఉండగా వేదికపై బాలీవుడ్ సాంగ్ కు డాన్స్ చేస్తుండగా పరిణిత జైన్ అకస్మాత్తుగా కుప్ప కూలిపోయింది,
అక్కడ ఉన్నవారు ఆమె కు సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నం చేయగా ఆమె అప్పటికే మృతి చెందినట్లుగా గుర్తించారు.