🔹 ఫైల్స్ బయటకు వెళ్లొద్దని ఆదేశాలు
🔹 అధికారుల పై నిరంతర పర్యవేక్షణ
🔹 దస్త్రాలను సేకరించేందుకు ప్రత్యేక బృందం
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 9, 2025
ఢిల్లీ సచివాలయంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్ (LG) వినయ కుమార్ సక్సేనా ఆదేశాల మేరకు సచివాలయంలోని అన్ని ఫైల్స్, రికార్డ్స్ భద్రపరచాలని నిర్ణయం తీసుకున్నారు. ఎటువంటి అధికారిక ఫైల్ కూడా బయటకు వెళ్లకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ చర్యల వెనుక ముఖ్యమైన కారణాలు ఏవన్నా ఉన్నాయా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ప్రభుత్వం నిర్వహణలో అక్రమాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
LG ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, సచివాలయంలో ఉన్న అన్ని దస్త్రాలను సమీక్షించి భద్రపరిచే ప్రక్రియ ప్రారంభమైంది. ఏ ఒక్క అధికారి కూడా అనుమతి లేకుండా ఫైల్స్ బయటకు తరలించకూడదని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.