- రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్బీఐ
- కొత్త రెపో రేటు 6.50% నుంచి 6.25% కి తగ్గింపు
- గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలపై వడ్డీ భారం తగ్గే అవకాశం
- ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక ప్రకటన
లోన్లు తీసుకున్న వారికి శుభవార్త. భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లను సవరించింది. రెపో రేటును 0.25 శాతం తగ్గించి 6.50% నుంచి 6.25%కి తీసుకువచ్చింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో గృహ రుణం, వ్యక్తిగత రుణం తీసుకున్నవారికి వడ్డీ భారం తగ్గే అవకాశముంది.
లోన్లు తీసుకున్న కోట్లాది మంది ప్రజలకు భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) శుభవార్త అందించింది. ఆర్బీఐ తాజాగా వడ్డీ రేట్లను సవరించింది. రెపో రేటును 0.25 శాతం తగ్గించి 6.50% నుంచి 6.25%కి తీసుకువచ్చింది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక ప్రకటన చేశారు.
సామాన్యులకు ఊరట
రెపో రేటును తగ్గించడం గడిచిన ఐదేళ్లలో ఇదే తొలిసారి. మే 2023 నుంచి రెపో రేటును స్థిరంగా ఉంచిన ఆర్బీఐ, ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని తొలిసారి తగ్గించింది. దీంతో గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలపై వడ్డీ భారం తగ్గే అవకాశం ఉంది.
కేంద్రం ఒత్తిడి – ఆర్బీఐ నిర్ణయం
పలు సమావేశాల్లో ఆర్బీఐ ద్రవ్య పరపతి కమిటీ (MPC) సభ్యులు వడ్డీ రేట్ల తగ్గింపును సమర్థించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఇప్పటివరకు ఆ నిర్ణయం తీసుకోలేదు. అయితే, కేంద్ర ప్రభుత్వం కూడా వడ్డీ రేట్ల తగ్గింపుపై ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రుణగ్రహీతలకు లాభం
వడ్డీ రేట్లు తగ్గడంతో బ్యాంకులు కొత్త రుణాలకు తక్కువ వడ్డీని నిర్ణయించే అవకాశం ఉంది. గృహ రుణాలు, విద్యా రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలపై వడ్డీ తక్కువయ్యే అవకాశముండటంతో రుణగ్రహీతలకు ఇది భారీ ఊరటగా మారనుంది.