- ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం
- ఎస్ఐపీబీ ఆమోదించిన పెట్టుబడి ప్రాజెక్టుల ఆమోదంపై చర్చ
- రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణపై నిర్ణయం
- 22ఏ భూముల అంశం చర్చకు వచ్చే అవకాశం
- ఉన్నత విద్యమండలికి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు అంశం పరిశీలన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్‌లో జరగనుంది.
ఈ సమావేశంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) ఆమోదించిన పలు యూనిట్లకు అనుమతి ఇవ్వనున్నారు. అదే విధంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చించనున్నారు.
కేబినెట్ సమావేశంలో 22ఏ భూముల అంశం, ఉన్నత విద్యామండలికి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు వంటి కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశముంది.
ఈ సమావేశంలో రాష్ట్ర పాలనకు సంబంధించిన మరికొన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉన్నందున రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.