ప్రశాంతంగా కొనసాగిన ఢిల్లీ ఎన్నికలు

ప్రశాంతంగా కొనసాగిన ఢిల్లీ ఎన్నికలు

ప్రశాంతంగా కొనసాగిన ఢిల్లీ ఎన్నికలు

మనోరంజని  ప్రతినిధి

న్యూఢిల్లీ:ఫిబ్రవరి 05

ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్ఠా త్మకంగా తీసుకున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగింపు దశకు వచ్చింది. సాయంత్రం 5 గంటల వరకూ 57.70 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు.

ఈశాన్య ఢిల్లీలో అత్యధి కంగా 63.83 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా సౌత్ ఈస్ట్ ఢిల్లీలో 53.77 శాతం పోలింగ్ నమోదైంది.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, హర్దీప్ సింగ్ పురి, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి, అప్ సుప్రీం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, సీజేఐ సంజీవ్ ఖన్నా, సీఈసీ రాజీవ్ కుమార్ తదితర ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించు కున్నారు.

సీలాంపూర్, జాంగ్‌పుర, కస్తూర్బా నగర్‌లో నకిలీ ఓట్లు పోలవుతున్నాయం టూ ఆరోపణలు రావడంతో అధికారులు, పోలీసు యంత్రాంగం అప్రమత్తమ య్యాయి. పార్టీల ఆరోప ణలో ఎలాంటి వాస్తవం లేదని నిర్ధారించ డంతో పరిస్థితి సద్దుమణిగింది.

ఆప్ సుప్రీం న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. ఆయనపై బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ పోటీ పడుతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషిపై బీజేపీ ఢిల్లీ విభాగం చీఫ్ రమేష్ బిధూరి, కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లంబా పోటీలో ఉన్నారు.

మరో కీల నియోకవర్గం జాంగ్‌పుర. ఆప్ వరుసగా రెండు సార్లు గెలిచిన ఈ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థిగా మనీష్ సిసోడియా, బీజేపీ నుంచి తర్వీందర్ సింగ్, కాంగ్రెస్ అభ్యర్థిగా ఫర్హద్ సూరి పోటీ పడుతున్నారు.

కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా ఆప్, బీజేపీ మధ్యనే ఉంది. కాంగ్రెస్ సైతం మెరుగైన ఫలితాలు ఆశిస్తోంది. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి

Join WhatsApp

Join Now

Leave a Comment