03.02.2025
నేటి రాశి ఫలాలు
🐐 మేషం
03-02-2025)
పట్టుదలతో పనిచేస్తే మీరు కోరుకున్నది సాధించగలరు. అయితే, అనవసరంగా కష్టాలను ఆహ్వానించకుండా జాగ్రత్త వహించండి. కొన్ని పరిస్థితులు మనస్సులో బరువును కలిగించవచ్చు. దుర్గా దేవిని ధ్యానించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.
🐂 వృషభం
03-02-2025)
ఉద్యోగ,వ్యాపార రంగాలలో మంచి నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కొన్ని సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. ముఖ్యమైన విషయాలలో మంచి ఫలితాలు సాధించవచ్చు. ఇష్టదేవత ఆరాధన శుభకరం.
💑 మిధునం
03-02-2025)
మీరు ప్రారంభించిన పనులలో పురోగతి సాధించవచ్చు. మానసికంగా దృఢంగా ఉండండి. సౌభాగ్యసిద్ధి మీకు అనుకూలంగా ఉంటాయి. ఇష్ట దేవతను స్తుతించడం మంచిది.
🦀 కర్కాటకం
03-02-2025)
మీరు ప్రారంభించిన కార్యక్రమాలలో విజయం సాధించవచ్చు. ఒక శుభవార్త మీకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. సహాయకులు మీకు తోడుగా ఉంటారు. శ్రీవేంకటేశ్వరుని దర్శనం శుభకరం.
🦁 సింహం
03-02-2025)
మీ లక్ష్యాలకు కట్టుబడి పనిచేయండి. అనవసర సందేహాలతో సమయాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు పెంపొందించుకోండి. ప్రయాణంలో కొన్ని ఆటంకాలు ఎదురుకావచ్చు. శివుని ఆరాధన శుభకరం.
💃 కన్య
03-02-2025)
మీరు ప్రారంభించిన పనులలో విజయం సాధించవచ్చు. మీ కీర్తి పెరుగుతుంది. బంధువుల నుంచి ఆదరణ, ప్రేమ లభిస్తుంది. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. శ్రీఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.
⚖ తుల
03-02-2025)
స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని పోషకాహారం తీసుకోండి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇవ్వండి. శ్రీఆంజనేయ స్వామి దర్శనం శుభకరం.
🦂 వృశ్చికం
03-02-2025)
మీ శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగంలో పై అధికారులతో మంచి సంబంధాలు పెంపొందించుకోండి. మీ ఉత్సాహాన్ని తగ్గించే వ్యక్తులకు దూరంగా ఉండండి. సూర్యుని స్తుతించడం మంచిది.
🏹 ధనుస్సు
03-02-2025)
మీరు ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు ఎదురవ్వకుండా. జాగ్రత్త వహించండి. ఉద్యోగ,వ్యాపార రంగాలలో నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కొన్ని సంఘటనలు బాధ కలిగించవచ్చు, కానీ అధైర్యపడకండి. దుర్గా దేవిని స్తుతించడం మంచిది.
🐊 మకరం
03-02-2025)
ప్రశాంతమైన ఆలోచనలతో ముందుకు సాగండి. మీ సామర్ధ్యాన్ని పెంచుకోండి. ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. శ్రీవేంకటేశ్వరుని దర్శనం శుభకరం.
🏺 కుంభం
03-02-2025)
పనులను వాయిదా వేయకండి. కొన్ని సందర్భాలలో వివేకంగా వ్యవహరించి సమస్యలను నివారించండి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి. గణపతిని ఆరాధించడం శుభకరం.
🦈 మీనం
03-02-2025)
వివిధ రంగాలలో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలు పొందవచ్చు. మీ పట్టుదల మిమ్మల్ని విజయవంతం చేస్తుంది. అనవసర విషయాల గురించి కలుగజేసుకోకండి. శ్రీలక్ష్మీ దేవిని ధ్యానించడం మంచిది.