తిరుమల శిలాతోరణం వద్ద చిరుత ప్రదర్శన
🔹 భక్తుల సమాచారం మేరకు అటవీశాఖ అప్రమత్తం
🔹 సర్వదర్శన టోకెన్ల క్యూలైన్ సమీపంలో చిరుత సంచారం
తిరుమలలో చిరుత సంచారం భక్తుల్లో ఆందోళన రేపుతోంది. గురువారం సాయంత్రం శిలాతోరణం వద్ద చిరుత తిరుగుతున్నట్లు భక్తులు గమనించారు. వెంటనే TTD మరియు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతానికి సర్వదర్శన టోకెన్ల క్యూలైన్ సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. భక్తుల భద్రత కోసం అటవీ శాఖ అప్రమత్తమై పగడ్బందీ చర్యలు తీసుకుంటోంది.
తిరుమల పర్వతప్రదేశంలో ఇటీవలి కాలంలో వన్యప్రాణుల సంచారం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.