- ఏ-నెగటివ్ రక్తం అవసరమై కుటుంబ సభ్యుల విజ్ఞప్తి
- ముస్లిం ఏక్తా కమ్యూనిటీ ఉపాధ్యక్షుడు సాజిద్ వెంటనే స్పందించి డోనర్ ను ఏర్పాటుచేసారు
- సమాజంలో రక్తదానం అవశ్యకతపై అవగాహన పెంచిన సొసైటీ
- ఇప్పటివరకు 99,76 యూనిట్లు రక్తదానం చేసిన ముస్లిం ఏక్తా కమ్యూనిటీ
తెలంగాణ ముస్లిం ఏక్తా కమ్యూనిటీ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో, షేక్ ఆమేర్ సయ్యద్ అహ్మద్‌కు ఏ-నెగటివ్ రక్తం అవసరమై కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేయడంతో, సొసైటీ ఉపాధ్యక్షుడు సాజిద్ వెంటనే స్పందించి రక్తదాతను పంపించి రక్తదానం చేపట్టారు. సొసైటీ అధ్యక్షుడు షేక్ ముజాహిద్ యువత రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ముస్లిం ఏక్తా కమ్యూనిటీ సోషల్ వెల్ఫేర్ సొసైటీ మరోసారి తమ సేవా నిబద్ధతను చాటుకుంది. షేక్ ఆమేర్ సయ్యద్ అహ్మద్‌కు ఏ-నెగటివ్ రక్తం అత్యవసరంగా అవసరమై, కుటుంబ సభ్యులు కమ్యూనిటీకి సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే, కమ్యూనిటీ ఉపాధ్యక్షుడు సాజిద్ స్పందించి ఏ-నెగటివ్ రక్తదాతను ఏర్పాటుచేసారు. రక్తదానం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
సొసైటీ అధ్యక్షుడు షేక్ ముజాహిద్ మాట్లాడుతూ, సమాజంలో యువత రక్తదానానికి ముందుకు రావాలని, వాట్సాప్ స్టేటస్లు, గ్రూపుల ద్వారా సమాచారం అందించగానే స్పందించాలని కోరారు. ఇప్పటివరకు ముస్లిం ఏక్తా కమ్యూనిటీ 99,76 యూనిట్లు రక్తదానం చేసింది. నిర్మల్ యువకులు, పెద్దలు ఈ సంఘానికి మద్దతుగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.