ఏపీలో మరో భారీ స్కామ్‌: కనకదుర్గ గోల్డ్ గోల్‌మాల్

: కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్‌ స్కామ్‌
  1. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్‌లో పది కోట్ల కుంభకోణం.
  2. నకిలీ బంగారం తాకట్టు పెట్టి లోన్లు తీసుకున్న సిబ్బంది.
  3. ఆడిట్‌లో స్కామ్ బయటపడటంతో 26 మందిపై కేసులు.
  4. మిగతా బ్రాంచ్‌ల్లోనూ దగాకోరుల హవా ఉందా అనుమానాలు.

ఏపీలో మరో భారీ స్కామ్‌ బయటపడింది. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్‌లో నకిలీ బంగారంతో పది కోట్ల కుంభకోణం జరిగినట్టు తేలింది. ఉద్యోగులే నకిలీ బంగారం తాకట్టు పెట్టి లోన్లు తీసుకున్నారు. 26 మందిపై కేసులు నమోదయ్యాయి. మిగతా బ్రాంచ్‌ల్లోనూ ఇలాంటి దగాలు జరిగాయా అనేది పోలీసుల దర్యాప్తులో వెల్లడవనుంది.

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ స్కామ్‌ వెలుగుచూసింది. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్‌ బ్రాంచ్‌ల్లో పది కోట్ల కుంభకోణం బయటపడింది. ఉద్యోగులు, వారి బంధువులు, స్నేహితుల సహకారంతో నకిలీ బంగారం తాకట్టు పెట్టి భారీ మొత్తంలో లోన్లు తీసుకున్న విషయం ఆడిట్‌లో బయటపడింది.

చిత్తూరు జిల్లా పుంగనూరు, పలమనేరులో 8 కోట్ల స్కామ్‌ బయటపడగా, అనంతపురం జిల్లా ఉరవకొండ బ్రాంచ్‌లో 56 లక్షల నకిలీ లావాదేవీలు గుర్తించారు. కంపెనీ మేనేజర్ ప్రశాంత్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ వెంకటేశ్వర్లు, ఆడిటర్ రామాంజనేయులు సహా 26 మందిపై కేసులు నమోదయ్యాయి.

ఈ స్కామ్‌ గురించి తెలియగానే పోలీసులు, కంపెనీ యాజమాన్యం దర్యాప్తును ముమ్మరం చేశారు. మరిన్ని బ్రాంచ్‌ల్లోనూ ఇలాంటి దగాకోరుల హవా ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే కస్టమర్లు తాకట్టు పెట్టిన ఒరిజినల్‌ నగలు కూడా మాయమయ్యాయా అనే అంశంపై ఆరా తీస్తున్నారు.

కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్‌ ప్రధాన కార్యాలయం విజయవాడలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 60 బ్రాంచ్‌లను కలిగిన ఈ సంస్థలో జరిగిన ఈ భారీ కుంభకోణం ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment