- రిపబ్లిక్ డే వారోత్సవాల్లో మేడా శ్రీనివాస్ గారికి సేవా రత్న అవార్డు
- ప్రజా సేవలో మూడు దశాబ్దాలుగా అహర్నిశ సేవలకుగాను గౌరవ సూచికగా ఈ అవార్డు
- మేడా సేవలను కొనియాడిన ప్రముఖులు, అభిమానులు
రిపబ్లిక్ డే సందర్బంగా విజయవాడలోని కౌత కళాక్షేత్రంలో జరిగిన ఇండియన్ యాక్ట్స్ అవైర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ వారోత్సవ సభలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాస్ గారికి “సేవా రత్న” అవార్డు అందించారు. మూడున్నర దశాబ్దాలుగా ప్రజలకు అండగా నిలుస్తున్న మేడా గారి సేవలను ప్రశంసిస్తూ పార్టీల శ్రేణులు, సన్నిహితులు అభినందనలు తెలిపారు.
రిపబ్లిక్ డే సందర్భంగా విజయవాడ కౌత కళాక్షేత్రంలో జరిగిన ఇండియన్ యాక్ట్స్ అవైర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ వారోత్సవ సభలో మేడా శ్రీనివాస్ గారిని గౌరవిస్తూ “సేవా రత్న” అవార్డు ప్రదానం జరిగింది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అయిన మేడా శ్రీనివాస్
గత మూడు దశాబ్దాలుగా ప్రజలతో పాటు ఉంటూ, వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తూ ప్రజా హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ అవార్డు అందుకున్న సందర్భంగా పలువురు మేడా గారి సేవలను కొనియాడుతూ అభినందనలు తెలిపారు. మేడా గారి వంటి నాయకత్వం ప్రజాస్వామ్యానికి మైలురాయిగా నిలుస్తుందని, ఆయన ఆశయాల సాధన యువతలో దేశభక్తి భావాన్ని పెంపొందిస్తుందని పండితులు, రాజకీయ ప్రముఖులు పేర్కొన్నారు.
మేడా గారి సేవలకు ఇంకా ఎన్నో ఉన్నతమైన అవార్డులు లభించాలని, ఆయన నాయకత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కీలకమని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ప్రముఖులు పెండ్యాల కామరాజు, సిమ్మా దుర్గారావు తదితరులు మేడా సేవలను స్మరించారు.