- ఆస్కార్ 2025 నామినేషన్లు లాస్ ఏంజెల్స్‌లో విడుదల.
- ‘ది బ్రూటలిస్ట్’ మరియు ‘ఎమిలియా పెరెజ్’ అత్యధిక నామినేషన్లు.
- ఇండియన్ షార్ట్ ఫిల్మ్ ‘అనోజా’ ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో చోటు.
- మార్చి 2న అవార్డు ప్రదానోత్సవం, వ్యాఖ్యాత కోనన్ ఓబ్రియాన్.
ఆస్కార్ 2025 నామినేషన్లు ప్రకటించారు. అత్యధిక నామినేషన్లు ‘ది బ్రూటలిస్ట్’ మరియు ‘ఎమిలియా పెరెజ్’ చిత్రాలకు లభించాయి. ఇండియన్ షార్ట్ ఫిల్మ్ ‘అనోజా’ ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ అయ్యింది. ఈ కార్యక్రమం మార్చి 2న లాస్ ఏంజెల్స్‌లో జరగనుంది. కోనన్ ఓబ్రియాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్కార్ 2025 అవార్డుల నామినేషన్లను అకాడమీ గురువారం ప్రకటించింది. లాస్ ఏంజెల్స్‌లో ఇటీవల జరిగిన కార్చిచ్చు కారణంగా నామినేషన్ల ప్రకటన వాయిదా పడినా, ఎట్టకేలకు చిత్రాల జాబితా వెలువడింది.
ఈ ఏడాది అత్యధిక కేటగిరీల్లో ‘ది బ్రూటలిస్ట్’ మరియు ‘ఎమిలియా పెరెజ్’ చిత్రాలు చోటు దక్కించుకున్నాయి. వాటి తర్వాత స్థానాల్లో ‘కాన్క్లేవ్’, ‘అనోరా’, ‘డ్యూన్: పార్ట్ 2’, ‘ది సబ్‌స్టాన్స్’, ‘విక్డ్’, మరియు ‘ఎ కంప్లీట్ అన్నోన్’ ఉన్నాయి.
భారతదేశం నుంచి ‘అనోజా’ అనే షార్ట్ ఫిల్మ్ ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ అయింది. ఈ చిత్రానికి ప్రియాంక చోప్రా జోన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 2న జరగనుంది. ఈ వేడుకకు ప్రముఖ వ్యాఖ్యాత కోనన్ ఓబ్రియాన్ ఆతిథ్యం ఇవ్వనున్నారు.
ఉత్తమ చిత్రాల జాబితా:
- అనోరా
- ది బ్రూటలిస్ట్
- ఎ కంప్లీట్ అన్నోన్
- కాన్క్లేవ్
- డ్యూన్: పార్ట్ 2
- ఎమిలియా పెరెజ్
- ఐ యామ్ స్టిల్ హియర్
- నికెల్ బాయ్స్
- ది సబ్‌స్టాన్స్
- విక్డ్
ఉత్తమ దర్శకుడు:
- సీన్ బేకర్ (అనోరా)
- బ్రాడీ కార్బెట్ (ది బ్రూటలిస్ట్)
- జేమ్స్ మ్యాన్‌గోల్డ్ (ది కంప్లీట్ అన్నోన్)
- జాక్వెస్ ఆడియార్డ్ (ఎమిలియా పెరెజ్)
- కోరలీ ఫార్గేట్ (ది సబ్‌స్టాన్స్)