రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న నిఖిల్

రక్తదానం చేస్తున్న నిఖిల్
  • బైంసా పట్టణంలోని ఋషికేశ్ ఆసుపత్రిలో రక్త దాత నిఖిల్ సహాయం.
  • అత్యవసర పరిస్థితిలో టెంబి గ్రామ యువకుడికి రక్తదానం.
  • నిఖిల్ ఇప్పటి వరకు 18 సార్లు రక్తదానం చేసి సేవా స్పూర్తిని చాటారు.

నిర్మల్ జిల్లా బైంసాలో టెంబి గ్రామ యువకుడికి అత్యవసర పరిస్థితిలో నిఖిల్ రెస్టారెంట్ యజమాని నిఖిల్ రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. నిఖిల్ ఇప్పటివరకు 18 సార్లు రక్తదానం చేశారు. రోగి కుటుంబం, ఆసుపత్రి వైద్యులు అతడికి కృతజ్ఞతలు తెలియజేశారు.

నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని ఋషికేశ్ ఆసుపత్రిలో గురువారం టెంబి గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. వైద్యురాలు సింధు రక్తం అత్యవసరం కావాలని గుర్తించి, బ్లడ్ డోనర్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు సురేష్‌కు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే నిఖిల్ రెస్టారెంట్ యజమాని నిఖిల్ రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారు. రక్తనిది కేంద్రంలో రక్తదానం చేసి, యువకుడి ప్రాణాలు నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు.

బ్లడ్ డోనర్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు సురేష్ మాట్లాడుతూ, నిఖిల్ ఇప్పటి వరకు 18 సార్లు రక్తదానం చేసి స్ఫూర్తిదాయకంగా నిలిచారని తెలిపారు. రోగి కుటుంబ సభ్యులు, ఆసుపత్రి వైద్యులు నిఖిల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నిఖిల్ సేవా మనోభావం ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుందని అందరూ ప్రశంసించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment