సత్ఫలితాలు ఇస్తున్న జిల్లా ఎస్పీ భైంసా క్యాంప్
18 ఏండ్ల బాలుడు అదృశ్యం..
12 గంటలు తిరగక ముందే పట్టుకున్న పోలీసులు
మనోరంజని ప్రతినిధి
బైంసా : జనవరి 23
నిర్మల్ జిల్లా బైంసా క్యాంప్ ఆఫీసులో జిల్లా ఎస్పీ డా .జి.జానకి షర్మిల అందుబాటులో ఉండటం తెలుసుకుని కుబీర్ మండల నుంచి తన 18 ఏళ్ళ కుమారుడు తప్పిపోయాడు అని ఎస్పి కి నేరుగా పిర్యాదు ఇవ్వగా, వెంటనే స్పందించిన ఎస్పి తప్పిపోయిన పిల్లగాని ఆచూకీ కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేయాలని ఏఎస్పి అవినాశ్ కుమార్ ను ఆదేశించారు. జిల్లాలో ఉన్న నూతన సాంకేతిక పరిజ్ఞానంతో అదృశ్యం అయిన 12 గంటలలోపే మహారాష్ట్ర బార్డర్ లో సంచరిస్తున్న అతన్ని వెతికి పట్టుకుని కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది.
పిల్లగాని ఆచూకీలో తోడ్పడిన కుబీర్ ఎస్ఐ రవీందర్ టీంని జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల ప్రశంసించారు