అమెరికా జన్మతః పౌరసత్వం రద్దు.. భారతీయులపై ప్రభావమెంత?

అమెరికా జన్మతః పౌరసత్వం రద్దు.. భారతీయులపై ప్రభావమెంత?

అమెరికా జన్మతః పౌరసత్వం రద్దు.. భారతీయులపై ప్రభావమెంత?

USA : వలసదారులకు అమెరికా గడ్డపై పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు సహజంగా అమెరికా పౌరసత్వం (Birthright Citizenship) అందించే చట్టాన్ని నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) రద్దు చేశారు.

దాదాపు వందేళ్లుగా అమల్లో ఉన్న విధానానికి ఒక్క ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌తో ఫుల్‌స్టాప్‌ పెట్టారు. ”అక్రమ వలసదారులకు అమెరికాలో (USA) పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని మా ఫెడరల్‌ ప్రభుత్వం గుర్తించదు” అని ట్రంప్‌ స్పష్టం చేశారు. అయితే, ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రవాస భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? చట్ట సవరణ సాధ్యమేనా?

* ఏంటీ జన్మతః పౌరసత్వ హక్కు

అమెరికా చట్టాల ప్రకారం.. ఆ దేశ పౌరులకు పుట్టిన వారికి మాత్రమే కాకుండా.. అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరికీ అక్కడి పౌరసత్వం లభిస్తుంది. అమెరికా గడ్డపై పుట్టినవారంతా ఈ దేశ పౌరులే అనే ఉద్దేశంతో 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ద్వారా శరణార్థుల పిల్లలకు అమెరికా జన్మతః పౌరసత్వాన్ని అందిస్తోంది. ఇప్పటి వరకు ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగింది. అయితే, తాజాగా ట్రంప్‌ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్‌ ఉత్తర్వులతో దీనికి బ్రేక్‌ పడింది. ట్రంప్‌ ఉత్తర్వుల ప్రకారం.. బిడ్డకు జన్మనిచ్చే సమయానికి తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా, ఒక వేళ తండ్రి చట్టబద్ధంగా అమెరికాలో ఉన్నప్పటికీ.. శాశ్వత నివాసి కాకపోయినా పుట్టిన పిల్లలకు అమెరికా పౌరసత్వం రాదు. అలాగే, తండ్రి శాశ్వత నివాసి అయినప్పటికీ.. తల్లి తాత్కాలిక వీసా మీద అమెరికాలో నివాసం ఉంటున్నా అదే నియమం వర్తిస్తుంది.

* ప్రవాస భారతీయులపై ప్రభావం ఉంటుందా?

అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. 2024 చివరి నాటికి 5.4 మిలియన్ల మంది ఎన్నారైలు అక్కడ నివసిస్తున్నారు. అమెరికా మొత్తం జనాభాలో సుమారు 1.47 శాతం భారతీయులే. వీరిలో 34 శాతం మంది అమెరికాలో పుట్టినవారు. మిగతావారంతా వలసదారులు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం భారతీయులపై ప్రభావం చూపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తాత్కాలిక వీసాపై అమెరికా వెళ్లి.. గ్రీన్‌ కార్డుకోసం వేచిచూస్తున్న వారికి పుట్టిన పిల్లలెవరికీ అమెరికా పౌరసత్వం లభించదు.

ప్రభావం ఎలా?

* అమెరికాలో భారతీయ తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలకు ఇప్పటిలా అక్కడి జన్మతః పౌరసత్వం లభించదు.

* ఇప్పటికే గ్రీన్‌ కార్డు రాక ఇబ్బంది పడుతున్న చాలా మంది భారతీయ వలసదారులు, వారి పిల్లలకు కూడా అక్కడి పౌరసత్వం రాకపోతే.. గ్రీన్‌ కార్డు జారీ ప్రక్రియ మరింత ఆలస్యమవుతుంది.

* అమెరికాలో జన్మించిన వారికి జన్మతః పౌరసత్వం లభించకపోతే.. వారికి 21 ఏళ్లు నిండిన తర్వాత తమ తల్లిదండ్రులను అమెరికాకు తీసుకొస్తామని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోలేరు. దీనివల్ల తల్లిదండ్రులు భారత్‌లో, పిల్లలు అమెరికాలో ఉండాల్సి వస్తుంది. చట్టపరమైన సమస్యలు ఎదురుకావొచ్చు.

* ‘బర్త్‌ టూరిజం’ మాయమైపోతుంది. పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించాలన్న ఉద్దేశంతో.. ఉన్నత స్థితిలో ఉన్న చాలా మంది భారతీయ మహిళలు.. డెలివరీ సమయానికి అమెరికా వెళ్లిపోతుంటారు. దీనినే ‘బర్త్‌ టూరిజం’ గా చెబుతుంటారు. ఇకపై దీనికి బ్రేక్‌ పడనుంది.

* నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసాపై అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులకు జన్మించిన పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించడం దాదాపు అసాధ్యం. అమెరికాలో ఉంటున్న విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది భారతీయులే. ప్రత్యేకంగా ఇంజినీరింగ్‌, టెక్నాలజీ విభాగాల్లో ఎక్కువగా ఉంటారు. వీరిలో కొందరు ఇతర దేశాలకు చెందిన వారిని అక్కడే వివాహం చేసుకుంటారు. ఇలాంటి వారు ఇకపై పిల్లల విషయంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

* _2011లో అమెరికా ఇమ్మిగ్రేషన్‌ కౌన్సిల్‌ విడుదల చేసిన వాస్తవ పత్రం ప్రకారం.. ఒక వేళ జన్మతః పౌరసత్వాన్ని నిలిపివేస్తే దాని ప్రభావం దాదాపు అందరిపైనా పడుతుంది. అమెరికా ప్రజలు కూడా తమ పిల్లలు ఈ దేశానికి చెందిన వారే అని నిరూపించుకోవాల్సి వస్తుంది.

* అంత సులువు కాదు.!

_అధ్యక్షుడు ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేసినప్పటికీ, ఈ విధానాన్ని రద్దు చేసేందుకు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశముంది. అమెరికా రాజ్యాంగంలోని నిబంధనలను మార్చడం చాలా సుదీర్ఘ ప్రక్రియ అంతేకాకుండా సవాళ్లతో కూడుకున్నది. అమెరికా రాజ్యాంగాన్ని సవరించడానికి హౌస్‌, సెనేట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ ఓట్లు అవసరం. ఆ తర్వాత రాష్ట్ర శాసనసభల్లో నాలుగింట మూడొంతుల మంది దానిని ఆమోదించాలి. కొత్త సెనేట్‌లో డెమొక్రాట్‌లకు 47 స్థానాలు ఉండగా.. రిపబ్లికన్లకు 53 స్థానాలున్నాయి. మరోవైపు హౌస్‌లో డెమొక్రాట్లకు 215 స్థానాలు, రిపబ్లికన్లకు 220 స్థానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రాజ్యాంగ సవరణ అంత సులభం కాకపోవచ్చు

Join WhatsApp

Join Now

Leave a Comment