👉 మహిళలపై అణచివేతలు, లైంగిక దాడులపై పౌర సమాజం పోరాడాలని పిలుపు.
👉 డిశెంబరు 24న మంచిర్యాలలో రెండు రాష్ట్ర కమిటీల ఐక్యత సభ.
👉 మహిళలకు సమాన పనికి సమాన వేతనం మరియు గౌరవం అవసరం.
నిజామాబాద్‌లోని కోటగల్లి నీలం రామచంద్రయ్య భవనంలో, ప్రగతిశీల మహిళా సంఘం (POW) జిల్లా అధ్యక్షురాలు ఆకుల అరుణ నాయకత్వంలో ఐక్యత సభ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఆమె మాట్లాడుతూ, మహిళలపై అణచివేతలు, హత్యలు, లైంగిక దాడులు పెరుగుతున్నాయని, పౌర సమాజం ఈ దాడులను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
ప్రగతిశీల మహిళా సంఘం (POW) ఆధ్వర్యంలో ఈరోజు నిజామాబాద్ నగరంలోని కోటగల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు ఆకుల అరుణ మాట్లాడుతూ, మహిళలపై జరుగుతున్న హత్యలు, లైంగిక దాడులు, అణచివేతలు వంటి ఘటనలను పౌర సమాజం తీవ్రంగా ఖండించాలని అన్నారు.
అత్యాచారాలు, గృహ హింస, వరకట్నహత్యలపై పోరాడటంలో POW సంఘం కట్టుబడి ఉందని, విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో మహిళల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తుందని ఆమె వివరించారు.
అరుణ, మహిళలకు సమాన పనికి సమాన వేతనం, సురక్షిత జీవనానికి తగిన విధంగా శిక్షలు అమలు కావాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
నెల 24న మంచిర్యాల పట్టణంలో నిర్వహించనున్న రెండు రాష్ట్ర కమిటీల ఐక్యత సభలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సంఘానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సంఘ సభ్యులు లక్మి, సంజన, రేఖ, సురేఖ తదితరులు పాల్గొన్నారు.