- హామీ అమలుపై నందిపేట మండలం కుద్వాన్పూర్ ప్రజల ఆగ్రహం
- ఎన్నికల సమయంలో 10 ఇండ్ల నిర్మాణం హామీ ఇచ్చిన పైడి రాకేష్ రెడ్డి
- హామీ అమలు కాలేదని గ్రామ సభలో నిలదీసిన గ్రామస్తులు
- విమర్శల మధ్య గ్రామసభ నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యే
నందిపేట మండలం కుద్వాన్పూర్ గ్రామంలో గ్రామసభలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన 10 ఇండ్ల హామీ అమలు కాలేదని నిలదీసిన ప్రజలు, “ఏం మొహం పెట్టుకొని వచ్చావ్?” అంటూ ప్రశ్నించారు. ఆందోళనల మధ్య ఎమ్మెల్యే సభ నుంచి వెళ్లిపోయారు.
ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట మండలం కుద్వాన్పూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని గ్రామస్తులు తీవ్రంగా ప్రశ్నించారు. ఎన్నికల ముందు 10 ఇండ్లు నిర్మిస్తానని హామీ ఇచ్చిన ఆయన, హామీ అమలు చేయకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామసభలో పాల్గొన్న ప్రజలు, “ఏం మొహం పెట్టుకొని వచ్చావ్?” అంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది. ప్రజలు హామీల అమలుపై స్పష్టత కోరగా, ఎమ్మెల్యే సమాధానం ఇవ్వకుండానే సభ నుంచి వెళ్లిపోయారు.
ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యేలు తమ మాటలకు నిలబడి ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని డిమాండ్ చేస్తున్నారు.