- సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు డెహ్రాడూన్‌లో గుండెపోటు
- వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స ప్రారంభం
- ప్రాణాపాయం తప్పి ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యుల ప్రకటన
- అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన
సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గుండెపోటుకు గురై డెహ్రాడూన్‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయనకు స్టంట్ అమర్చగా, ప్రాణాపాయం తప్పినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు ఊపిరి పీల్చుకోగా, పద్మారావు గౌడ్‌ను రాత్రికి హైదరాబాద్‌కు తరలించనున్నారు.
బీఆర్ఎస్ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ మంగళవారం సాయంత్రం డెహ్రాడూన్‌లో గుండెపోటుకు గురయ్యారు. కుటుంబంతో కలిసి పర్యటిస్తున్న ఆయన ఒక్కసారిగా హార్ట్ స్ట్రోక్‌కు గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించి, స్టంట్ అమర్చారు. ప్రాణాపాయం తప్పిన పద్మారావు గౌడ్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు స్పష్టం చేశారు. ఈ వార్త తెలిసిన వెంటనే బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందగా, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలియడంతో ఊరట పొందారు.
పార్టీ శ్రేణులు ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. పద్మారావు గౌడ్‌ను రాత్రికి హైదరాబాద్‌కు తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.