- ఒక్కసారిగా మారిన ప్రకాశం జిల్లా వాతావరణం
- ఉష్ణోగ్రతల పతనం, ఉదయం 9 గంటలైనా పొగమంచు కొనసాగుతోంది
- చలికి వణికిపోతున్న వృద్ధులు, చిన్నారులు
- ఊటీని తలపిస్తున్న దృశ్యాలు
ప్రకాశం జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి పొగమంచు తీవ్రత పెరిగింది. ఉదయం 9 గంటలైనా మంచు తగ్గలేదు. ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. వృద్ధులు, చిన్నారులు చలికి వణుకుతున్నారు. రోడ్లపై మంచు కప్పేసిన దృశ్యాలు ఊటీని తలపిస్తున్నాయి. స్థానికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి పొగమంచు ప్రభావం జిల్లావ్యాప్తంగా కన్పిస్తోంది. ఉదయం 9 గంటలైనా పొగమంచు తగ్గకపోవడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో వృద్ధులు, చిన్నారులు చలికి వణికిపోతున్నారు.
రాత్రి వేళల్లో మంచు తీవ్రత అధికంగా ఉండటంతో రోడ్లపై విజిబిలిటీ తగ్గి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఊటీని తలపించే దృశ్యాలు ప్రకాశం జిల్లాలో కన్పిస్తున్నాయి. ప్రజలు ఉదయం బయటకు రావడానికి జంకుతున్నారు. చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు శీతల గాలిని నివారించేందుకు ప్రయత్నించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.