బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
మనోరంజని ( ప్రతినిధి )
కుబీర్ : జనవరి 19
ఉత్తరప్రదేశ్లోని బృందావన్ ప్రాంతంలో ప్రమాదవశాత్తు బస్సు దగ్ధం కావడంతో కుబీర్ మండలం పల్సి గ్రామానికి చెందిన శిల్యం దూర్పతి మృతి చెందారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులను మాజీ శాసనసభ్యులు జి విఠల్ రెడ్డి పరామర్శించరు. ప్రభుత్వం తరుపునుండి సహాయ సహకారాలు అందిస్తామని భాదిత కుటుంబనికి భరోసానిచ్చారు.
జిల్లా ఇన్చార్జి మంత్రి ఇన్చార్జి మంత్రి సీతక్క దృష్టికి తీసుకువెళ్లి ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కూడా మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. సంబంధిత అధికారులకు కూడా మాట్లాడడం జరిగింది.
మాజీ శాసనసభ్యులు గారి వెంట మాజీ జెడ్పిటిసి శంకర్ చౌవాన్, మాజీ ఎంపీపీ రాజేశ్వర్, మాజీ ఎఎం సి చైర్మన్ సంతోష్, కుబీర్ మాజీ సర్పంచ్ విజయ్, పల్సి మాజీ ఉప సర్పంచ్ దత్తు, సురేష్ ఠాకూర్, డాక్టర్ రాజన్న, మెంచు రాములు, ముత్యం, రాజు, కామాజీ, సత్యనారాయణ, మల్లేష్, దత్తు, పోతన్న, రవి, రాములు, విలాస్, సూది రాజన్న కళ్యాణ్, సాయి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు