తెలంగాణ : నాలుగు పథకాలపై కీలక ఆదేశాలు

: Telangana_Schemes_Implementation_Meeting
  • గ్రామ సభలలో లబ్ధిదారుల జాబితా ఆమోదం
  • ఈనెల 26న నాలుగు పథకాల ప్రారంభం
  • పథకాలకు అర్హుల ఎంపికపై ప్రత్యేక చర్యలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యేక శ్రద్ధ

 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు ఈనెల 26వ తేదీ నుండి అమలులోకి రానున్నాయి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు లబ్ధిదారుల జాబితాను ఈనెల 21న గ్రామ సభల ద్వారా ఆమోదం పొందాలని సీఎస్ శాంతి కుమారి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ఈనెల 26న ప్రారంభించనుంది. ఈ పథకాల లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కఠిన ఆదేశాలు ఇచ్చారు.

రైతు భరోసా పథకానికి సంబంధించి సాగుయోగ్యంకాని భూముల వివరాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి గ్రామ సభల ద్వారా ఆమోదం పొందాలని సూచించారు. అలాగే, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజులు పనిచేసిన వ్యవసాయ కూలీలను గుర్తించి జాబితాను ప్రకటించాలని చెప్పారు.

రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల లబ్ధిదారుల ఎంపికపై కూడా గ్రామ సభల ద్వారా నిర్ధారణ జరపాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో పలు శాఖల ముఖ్య కార్యదర్శులు, రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment