- ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో అవినీతి ఆరోపణలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు
- సీఎం రేవంత్ రెడ్డికి లైడిటెక్టర్ పరీక్షకు కేటీఆర్ సవాల్
- “ఒక్క పైసా అవినీతి చేయలేదని చర్చకు సిద్ధం” అని కేటీఆర్ స్పష్టం
ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో అవినీతి ఆరోపణలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని లైడిటెక్టర్ పరీక్షకు సవాల్ విసిరారు. “రాజకీయ కుట్రలతో నిజాలను వంచించలేరు. లైవ్ కెమెరాల ముందు లైడిటెక్టర్ పరీక్ష చేయించండి,” అని రేవంత్‌కు తేల్చిచెప్పారు. రేవంత్ రెడ్డి ఆరోపణలు నిరాధారమైనవని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
నీకు దమ్ముంటే లైడిటెక్టర్ పరీక్ష పెట్టు: కేటీఆర్ రేవంత్‌కు సవాల్
ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో అవినీతి ఆరోపణలపై తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ, “ఈ వ్యవహారంలో చర్చకు సిద్ధంగా ఉన్నా. నీకు ధైర్యముంటే లైడిటెక్టర్ పరీక్ష పెట్టు,” అని సవాల్ విసిరారు.
కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, “ఫార్ములా ఈ వ్యవహారంలో ఒక్క పైసా అవినీతి జరగలేదని తేల్చిచెప్పుతున్నా. రేవంత్ రెడ్డి లాంటి దొంగకు అన్నీ అవినీతి గానే కనిపిస్తాయి. లైవ్ కెమెరాల ముందు లైడిటెక్టర్ పరీక్ష చేయిస్తే, నిజాలు ప్రజలకు బయటపడతాయి,” అని పేర్కొన్నారు.
రేవంత్‌కు ఘాటుగా కేటీఆర్:
“రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు చూస్తుండగా లైడిటెక్టర్ పరీక్షకు రండి. నిజం ఎవరిదో తేల్చుకుందాం,” అని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డిపై నేరుగా విమర్శలు చేస్తూ, “లొట్టపీస్ కేసులు, దొంగ ఆరోపణలు ఎక్కడా నిలవవు,” అని అభిప్రాయపడ్డారు.
సోషల్ మీడియాలో చర్చకు దారితీసిన వ్యాఖ్యలు:
కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత సోషల్ మీడియాలో ఈ అంశం పెద్ద చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మళ్లీ విమర్శల దాడి మొదలుపెట్టారు.