నిర్మల్ జిల్లా ఉత్సవాల్లో రబింద్రా విద్యార్థుల ప్రతిభ

Rabindra School Students Nirmal Utsav Exhibition
  • రబింద్రా ఉన్నత పాఠశాల విద్యార్థులు నిర్మల్ ఉత్సవాల్లో చక్కటి ప్రతిభ.
  • స్వయంగా గీసిన పెయింటింగ్స్ మరియు అంతరిక్ష పరిశోధన సంస్థ నమూనాలు ప్రత్యేక ఆకర్షణ.
  • కలెక్టర్ అభిలాష అభినవ్ చేత ప్రశంసలు.

Rabindra School Students Nirmal Utsav Exhibition

ముధోల్ : జనవరి 05 – ముధోల్ లోని రబింద్రా ఉన్నత పాఠశాల విద్యార్థులు, నిర్మల్ జిల్లా ఉత్సవాల్లో చక్కటి ప్రతిభ కనబరిచి, తమ స్వయంగా గీసిన పెయింటింగ్స్ మరియు భారత అంతరిక్ష సంస్థ ఆధ్వర్యంలో చేసిన ఉపగ్రహాల పనితీరును ప్రదర్శించారు. ఈ ప్రదర్శన ద్వారా వారు జిల్లా అధికారులను ఆశ్చర్యపరిచారు. కలెక్టర్ అభిలాష అభినవ్, విద్యార్థులకు ప్రశంసలు అందించారు.

 

నిర్మల్ జిల్లా , ముధోల్ లోని రబింద్రా ఉన్నత పాఠశాల విద్యార్థులు, నిర్మల్ జిల్లా ఉత్సవాల్లో తన ప్రతిభను చాటుకున్నారు. వారు స్వయంగా గీసిన చెరియాల పెయింటింగ్స్ మరియు భారత అంతరిక్ష సంస్థ ఆధ్వర్యంలో రోదసిలో పంపే ఉపగ్రహాల పనితీరును ప్రదర్శించి, జిల్లా స్థాయి అధికారులు అబ్బురపడ్డారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు, అంతరిక్ష పరిశోధన సంస్థ నమూనా మరియు పెయింటింగ్స్ లో అద్భుతమైన కళానైపుణ్యాన్ని ప్రదర్శించారు.

ఈ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రదర్శన అనంతరం ప్రశంసించారు. విద్యార్థుల వద్ద ఈ ప్రదర్శనకు పాల్గొనే పాఠశాల ప్రిన్సిపల్ ఆసంవార్ సాయినాథ్, ఉపాధ్యాయ బృందం మరియు ఇతరులను కూడా కొనియాడారు.

Join WhatsApp

Join Now

Leave a Comment