- పేదల కోసం 4 కోట్ల ఇళ్లు నిర్మించామని ప్రధాని మోదీ.
- ఢిల్లీని గత పదేళ్లుగా ఓ విపత్తు చుట్టుకుందన్న మోదీ.
- “బీజేపీలోనే అసలైన విపత్తు ఉంది” అంటూ కేజ్రీవాల్ ప్రతిస్పందన.
ప్రధాని నరేంద్రమోదీ తన కోసం ఇల్లు కట్టుకోలేదని, కానీ పేదల కోసం 4 కోట్ల ఇళ్లు నిర్మించామని తెలిపారు. ఢిల్లీలో డెవలప్‌మెంట్ అథారిటీ నిర్మించిన నివాస సముదాయాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని విమర్శించారు. మరోవైపు ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ బీజేపీనే అసలైన విపత్తు అని కౌంటర్ ఇచ్చారు.
ప్రధాని నరేంద్రమోదీ తన కోసం ఇల్లు కట్టుకోలేదని, కానీ గత పదేళ్లలో పేదల కోసం 4 కోట్ల ఇళ్లు నిర్మించామని తెలిపారు. ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మించిన పలు నివాస సముదాయాలను ప్రారంభించిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాము నాలుగు కోట్ల మందికి ఇళ్లు అందించామని, కానీ తాను అద్దాల మేడల్లో ఉండటం లేదని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా, ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. “గత పదేళ్లుగా ఢిల్లీని ఓ విపత్తు చుట్టుముట్టింది. స్కూల్స్, లిక్కర్, పొల్యూషన్ స్కాంలతో ఆప్ ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయింది. ప్రజలు ఇప్పుడు ఈ విపత్తుకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధమయ్యారు,” అని మోదీ వ్యాఖ్యానించారు.
దీనికి ప్రతిస్పందనగా, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బీజేపీనే అసలైన విపత్తు అని కౌంటర్ ఇచ్చారు. “బీజేపీకి ఢిల్లీలో సీఎంగా ప్రతిపాదించే అభ్యర్థి లేదు. ఆ పార్టీకి స్పష్టమైన అజెండా లేదా విజన్ కూడా లేదు. లక్షల విలువైన సూట్ ధరించే వ్యక్తి నుంచి అద్దాల మేడ గురించి మాట్లాడటం విడ్డూరం,” అని విమర్శించారు