- మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత
- రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు సంతాపం
- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హృదయపూర్వక నివాళులు
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి మరణించారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. దేశం గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయిందని ప్రధాన నేతలు నివాళులు అర్పించారు.
భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. 1991లో ఆర్థిక సంస్కరణలకు పునాది వేసిన మన్మోహన్ సింగ్, ఐదేండ్లు దేశానికి ప్రధానిగా విశేష సేవలు అందించారు.
మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం గొప్పనేతను కోల్పోయిందని వారు పేర్కొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త, రీఫార్మర్ అని కొనియాడారు. ఆయన చేసిన ఆర్థిక సంస్కరణలు దేశ అభివృద్ధికి కీలకమని తెలిపారు.