ఆంధ్రుల ఆత్మగౌరవానికి ముప్పుగా తెలంగాణా-ఆంధ్ర రాజకీయ ఉన్మాదాలు

ఆంధ్రుల ఆత్మగౌరవం రక్షణపై మేడా శ్రీనివాస్ మాట్లాడుతున్న దృశ్యం.
  1. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్న సినీ పరిశ్రమ రెండు కుటుంబాలు.
  2. కేసీఆర్, రేవంత్ రెడ్డి సర్కార్ల రాజకీయ కుతంత్రాలు.
  3. తెలంగాణాలో ప్రాంతీయ ఉన్మాదం, ఆంధ్రాలో కులం ఆధారిత ఉద్యమాలు.
  4. ఉన్మాద శక్తులకు బానిసలుగా మారిన తెలుగు సినిమా పరిశ్రమ.

రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడంలో రాజకీయ ఉన్మాద శక్తుల పాత్రపై విమర్శలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమ రెండు కుటుంబాలు ప్రాంతీయ రాజకీయాలకు బానిసలుగా మారాయని, కేసీఆర్, రేవంత్ రెడ్డి సర్కార్ల కుతంత్రాలు రెండు రాష్ట్రాల భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెడుతున్నాయని తెలిపారు. వీటి నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడంలో ప్రాంతీయ రాజకీయ శక్తుల పాత్రపై తీవ్ర విమర్శలు చేశారు. రాజమండ్రిలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణా సర్కార్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కలిసి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దిగజార్చే విధంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు.

తెలుగు సినీ పరిశ్రమలో రెండు ప్రముఖ కుటుంబాలు ప్రాంతీయ రాజకీయాలకు బానిసలుగా మారాయని, వారి క్రియలు రెండు తెలుగు రాష్ట్రాల భవిష్యత్‌కు ముప్పుగా ఉన్నాయని శ్రీనివాస్ విమర్శించారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి సర్కార్లు తెలుగు ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా అల్లు అర్జున్, చిరంజీవి వంటి సినీ ప్రముఖులను వాడుకుంటున్నారని, ఆంధ్రులకు “గో బ్యాక్ ఆంద్రోడా” నినాదాలు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయని తెలిపారు.

సినిమా పరిశ్రమ ముసుగులో రామ్ గోపాల్ వర్మ వంటి వ్యక్తులు కేసీఆర్ రాజకీయ ఉన్మాదాలను ప్రోత్సహిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ యువత మేలుకోకపోతే భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. రెండు రాష్ట్రాల ప్రజలు ఈ రాజకీయ కుతంత్రాలను గుర్తించి, సమాజం కోసం బలమైన రాజకీయ కర్యాచరణ చేపట్టాలని పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment