WJI 2024 పాత్రికేయ పురస్కారాల కోసం ప్రతిపాదనల ఆహ్వానం

WJI Awards 2024 Announcement Poster
  • వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా 2024 పురస్కారాల ప్రకటన
  • ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా విభాగాల్లో అవార్డులు
  • లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు ఎంపిక
  • ప్రముఖ సీనియర్ పాత్రికేయులు వల్లీశ్వర్ ఆధ్వర్యంలో స్క్రీనింగ్ కమిటీ

వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (WJI) 2024 పురస్కారాలకు మీడియా మిత్రుల ప్రతిపాదనలు ఆహ్వానిస్తోంది. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా విభాగాల్లో అవార్డులను ప్రకటించనుంది. లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు కూడా ఎంపిక ఉంటుంది. సీనియర్ జర్నలిస్టులు వల్లీశ్వర్ ఆధ్వర్యంలోని స్క్రీనింగ్ కమిటీ ద్వారా సంబంధిత కేటగిరీల్లో విజేతలను ఎంపిక చేస్తారు.

వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (WJI) 2024 సంవత్సరానికి పాత్రికేయ పురస్కారాల ప్రక్రియ ప్రారంభించింది. మీడియా మిత్రుల నైపుణ్యాలను గుర్తించి, వారిని మరింత ప్రోత్సహించేందుకు WJI ప్రతీ ఏడాది పురస్కారాలను అందజేస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా విభాగాల్లో వివిధ కేటగిరీలలో అవార్డులు ప్రకటించనుంది.

కేటగిరీలు:
1. ప్రింట్ మీడియా:

  • ఉత్తమ ప్రధాన ఎడిటర్
  • సబ్ ఎడిటర్
  • దర్యాప్తు కథనాలు
  • రిపోర్టర్
  • కాలమ్నిస్ట్
  • గ్రామీణ రిపోర్టర్
  • హ్యూమన్ ఇంట్రస్టింగ్ స్టోరీ
  • కార్టూనిస్ట్
  • ఉత్తమ లేఆ웃 (డిజైనర్)

2. ఎలక్ట్రానిక్ మీడియా:

  • ఇన్పుట్ ఎడిటర్
  • అవుట్‌పుట్ ఎడిటర్
  • రిపోర్టర్
  • సబ్ ఎడిటర్
  • వీడియో ఎడిటర్
  • గ్రాఫిక్స్ డిజైనర్
  • న్యూస్ ప్రెజెంటర్
  • ఉత్తమ హోస్ట్
  • వీడియో జర్నలిస్ట్

3. డిజిటల్ మీడియా:

  • ఉత్తమ కథ
  • ఉత్తమ యాంకర్
  • రిపోర్టర్
  • ఇంటర్వ్యూవర్

అదనంగా, లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు 2024 కోసం కూడా ప్రతిపాదనలు స్వీకరిస్తున్నారు.

ప్రతిపాదనలు పంపే విధానం:
మీ ప్రతిపాదనలు కింది లింక్ ద్వారా పంపాలి:
https://forms.gle/uPfDjtKZhucQX2GR6
కంపెనీ కవరింగ్ లెటర్ తప్పనిసరి.

నిబంధనలు:

  • ప్రతిపాదన స్టోరీ ప్రజలను చైతన్యపరిచే విధంగా ఉండాలి.
  • ఒకే అంశంపై చేసిన కథనాలు మల్టిపుల్ ఎంట్రీలలో వస్తే, మొదట వెలుగులోకి తెచ్చిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.
  • సీజనల్ కథనాలు పరిగణలోకి తీసుకోబడవు.
  • పేపర్ క్లిప్పింగ్ లేదా టెలికాస్ట్ వీడియోలు పంపించాలి.
  • తుది నిర్ణయం స్క్రీనింగ్ కమిటీదే.

WJI గత ఐదు సంవత్సరాలుగా జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడుతూ ఉత్తమ ప్రతిభావంతులకు పురస్కారాలు అందజేస్తోంది. ఇది మీడియా మిత్రుల కోసం నిర్వహించే ప్రత్యేక వేడుక. అందరూ సక్రియంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము.

Join WhatsApp

Join Now

Leave a Comment